ఏపీకి భారీ వర్ష సూచన. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీకి భారీ వర్ష సూచన.

November 8, 2022

భారత వాతావరణ విభాగం ఏపీకి వర్ష సూచన చేసింది. నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం కారణంగా ఈ నెల 10, 11 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. ఇది ఈ నెల 11న తమిళనాడు-పుదుచ్చేరి ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

బుధవారం కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు, గురువారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అలాగే అల్పపీడనం తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తాంధ్ర తీరంలో 65 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది.