తెలంగాణకు భారీ వర్ష సూచన - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణకు భారీ వర్ష సూచన

October 21, 2019

తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో పంట నాశనం అవుతోందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వాతావరణ శాఖ మరో భారీ వర్ష సూచన చేసింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్రలోని విదర్భ వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందన్నారు. కోమోరిన్ ప్రాంతం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందన్నారు.

rain prediction to telangana.

ఈ ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం రోజున హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాకాలం ముగిసే సమయంలో వానలు పడుతుండడంతో జనజీవనం స్తంభిస్తోంది. చిన్నపాటి వర్షానికే చిత్తడి చిత్తడిగా మారే హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.