మూలిగే నక్కపై తాడిపండు పడినట్టు.. ఇప్పటికే భారీ వర్షాలతో సతమతం అవుతోన్న తెలంగాణ ప్రజానికానికి వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. అక్టోబర్ 16 నుంచి 21 వరకు రాష్ట్రంలో వర్షాలు పడుతాయని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెదర్ బులెటిన్‌ను విడుదల చేసింది.
వచ్చే అయిదు రోజుల్లో తొలి మూడు రోజులు అంటే అక్టోబర్ 16, 17, 18వ తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ తేలకపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని సీనియర్ సైంటిస్టు రాజారావు వెదర్ బులెటిన్‌లో పేర్కొన్నారు. 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వివరించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.