హైదరాబాద్‌ వర్షం.. పోలీస్ స్టేషన్‌లోకి భారీగా వరద నీరు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌ వర్షం.. పోలీస్ స్టేషన్‌లోకి భారీగా వరద నీరు

September 25, 2019

మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌‌లో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. రోడ్లపై ఎక్కడ చూసినా వరద నీరే కనిపించింది. మ్యాన్‌ హోల్స్‌, డ్రైనేజిలు పొంగిపొర్లాయి. వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు.

Nacharam police station. #Hyderabadrains

Posted by Ch Sushil Rao on Tuesday, 24 September 2019

భారీ వర్షానికి ప్రధాన రహదారులు నదులను తలపించాయి. ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించడంతో ఉద్యోగులు, ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని రహదారులు జలమయం అయ్యాయి. మాదాపూర్‌లోని ప్రధాన రహదారి, కృష్ణానగర్‌ పరిసరాలు, చెరువును తలపించాయి. ఆయా ప్రాంతాల్లో బైక్‌లు, కార్లు వరద నీటిలో మునిగిపోయాయి. నాచారం పోలీస్ స్టేషన్ జలమయమవ్వడం గమనార్హం. స్టేషన్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.