తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన! - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

September 25, 2019

 తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌‌లలో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు కోరారు. తీర ప్రాంతాల్లో గాలులు వీస్తాయని ప్రజలు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. 

Railway hospital Lalaguda. #Hyderabadrains

Posted by Ch Sushil Rao on Tuesday, 24 September 2019

మంగళవారం సాయంత్రం కురిసిన వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలూ జలమయమయ్యాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది. లోతట్టు ప్రాంతలన్నీ చెరువులను తలపించాయి. భారీ వర్షానికి రోడ్లపై భారీగా డ్రైనేజి నీళ్లు ప్రవహించాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రుల్లోకి కూడా వరద నీరు రావడం గమనార్హం.