Malaysia Rains : మలేషియాను ముంచెత్తిన భారీ వర్షాలు..నిరాశ్రయులైన వేలాది మంది. - Telugu News - Mic tv
mictv telugu

Malaysia Rains : మలేషియాను ముంచెత్తిన భారీ వర్షాలు..నిరాశ్రయులైన వేలాది మంది.

March 5, 2023

మలేషియాను భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీగా కరుస్తున్న వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లు, రోడ్లన్నీ వరదనీటిలో మునిగిపోయాయి. వరదల కారణంగా వేలాదిమంది నిరాశ్రులయ్యారు. జోహెుర్ రాష్ట్రంలో దాదాపు 40వలే మంది ప్రజలు తమ ఇళ్లను వదలివెళ్లారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా సింగపూర్ కు సరిహద్దుగా ఉన్న ఆరు రాష్ట్రాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దక్షిణ జొహెుర్ లో రోజుల తరబడి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాధితులకోసం అధికారులు తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశారు. మలేషియాలో వరదలు అక్టోబర్ మార్చి మధ్య వార్షిక కాలంలో సాధారణం, కానీ ఈ వారం కురిసిన వర్షాలు చాలామంది నిరాశ్రయులను చేసిందని అధికారులు తెలిపారు.

 

నవంబర్, డిసెంబర్ లో వచ్చే వర్షాకాలాన్ని ఎదుర్కొనేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని..ప్రతి ఇంటికి ఒక పడవ ఉండేది…కానీ అనూహ్యమైన వాతావరణం కారణంగా భారీవర్షాలు కురువడం, వరదలు రావడంతో దిక్కుతోచని పరిస్థితులో పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల కారణంగా నిరాశ్రులైన ప్రజల కోసం అధికారులు రెండు వందలకు పైగా పునరావాస షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.