బెంగళూరు అతలాకులతం... వరదల్లో ఇద్దరు బలి - MicTv.in - Telugu News
mictv telugu

బెంగళూరు అతలాకులతం… వరదల్లో ఇద్దరు బలి

May 18, 2022

కర్ణాటక రాజధాని బెంగళూరును వరదలు ముంచేస్తున్నాయి. నిన్న సాయంత్రం మొదలైన వర్షం రాత్రంతా పడుతుండడంతో నగరం వరదమయమైంది. అనేక చోట్ల మూడు నుంచి నాలుగు అడుగుల వరకు వరద నీరు నిలిచిపోగా, ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. కేవలం 12 గంటల్లోనే 11.40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వరద నీటి ప్రవాహాన్ని డ్రెయిన్లు కూడా ఆపలేకపోయాయి. పలు చోట్ల వాటి కెపాసిటీకి మించి నీరు రావడంతో ఓవర్ ఫ్లో అవుతున్నాయి. దీంతో మంగళవారం రాత్రి వాహనాలు ముందుకెళ్లే పరిస్థితి లేక చాలా మంది తమ వాహనాలను అక్కడే వదిలేసి నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లారు. అపార్ట్‌మెంట్లు, విల్లాలు, లేఅవుట్లలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం వలన మెట్రో సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. కాగా, దశాబ్దాలుగా ప్రతీ సంవత్సరం తమకు ఈ తిప్పలు తప్పట్లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.