హైదరాబాద్ నగరాన్ని అతలాకుతం చేసిన వానదేవుడు మళ్లీ రెచ్చిపోయాడు. ఈ రోజు సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో కుండపోత కురుస్తోంది. మెహదీపట్నం, టోలిచౌకి, బంజారాహిల్స్, దిల్సుఖ్నగర్, అమీర్ పేట్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్నగర్, కర్మాన్ఘాట్, మీర్పేట, ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ట్రాఫిక్ వల్ల భారీగా రాకపోకలు స్తంభించాయి. మొన్నటి వర్షంతో నగరం జలమయం కావడంతో ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్న తరుణంలో వరణుడా కొరడా ఝుళిపించాడు.
వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి రాకూడదని, సాయం కావాల్సిన వాళ్లు ఎమర్జెన్సీ నంబర్లకు పోన్ చేయాలని అధికారులు సూచించారు. మరో మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. బంగాళాఖాతంలో 19న అల్పపీడనం వచ్చే అవకాశముందని తెలిపింది.
Again heavy rain started in #Hyderabad #HyderabadRains #HyderabadFloods pic.twitter.com/TXWcTQ35GC
— Mohammed Farzan Ahmed (@FarzanAhmedHyd) October 17, 2020