న్యూజిలాండ్ లో భీకర వర్షాలు విధ్యంసాన్ని సృష్టిస్తున్నాయి. గ్యాబ్రియెల్ తుఫాన్ విరుచుకుపడటంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. ఉత్తర దీవిలో భారీగా వర్షం కరుస్తోంది. దీంతో మంగళవారం ప్రభుత్వం ఎమర్జెన్సీని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. గాబ్రియెల్ తుఫాను కారణంగా విస్తృతంగా వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. సైక్లోనిక్ తుఫాను వినాశనాన్ని కలిగిస్తుందని.. దీని కారణంగా దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు అక్కడ ప్రభుత్వం వెల్లడించింది. నార్త్‌ల్యాండ్, ఆక్లాండ్, తైరవితి, బే ఆఫ్ ప్లెంటీ, వైకాటో, హాక్స్ బే, న్యూజిలాండ్ లో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజిలాండ్ చరిత్రలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం ఇది మూడోసారి.
కాగా న్యూజిలాండ్ లో అత్యవసర పరిస్థితి విధించడం చాలా అరుదు. ఇంతవరకు న్యూజిలాండ్ దేశ చరిత్రలో రెండు సార్లు మాత్రం ఎమర్జెన్సీ విధించారు. ఒకసారి 2019లో క్రైస్ట్ చర్చ్ పై ఉగ్రవాదులదాడి, రెండోసారి 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా ఎమర్జెన్సీ విధించారు. గతంలో ఏనాడూ కూడా ఇలాంటి వర్షాన్ని న్యూజిలాండ్ చూడలేదన్నారు మినిస్టర్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ కిరన్ మెక అనాల్టీ. భారీ వర్షం, బలంగా వీస్తున్న గాలుల కారణంగా వేలాది మంది నిరాశ్రులయ్యారని..డిక్లరేషన్ పై సంతకం పెట్టారు.