Heavy Rains In Telangana For The Next Three Days, says HMD
mictv telugu

తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌.. నేటి నుంచి 3 రోజులు అతి భారీవర్షాలు

August 7, 2022

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రెడ్‌ అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేసామని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకులు నాగరత్న తెలిపారు. బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలో శనివారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడటంతో.. రాష్ట్రంలో ఆదివారం మరింత తీవ్రమయ్యే సూచనలున్నాయి. కావున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రెడ్‌ అలర్ట్‌ హెచ్చరిక చేశారు.

అల్పపీడనానికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించినట్లు నాగరత్న తెలిపారు. తెలంగాణలో ఆదివారం, సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని.. వర్షం సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.