రానున్న మూడు రోజులూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారం ఉపరితల ద్రోణి దక్షిణ ఛత్తీశ్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిమీ ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ద్రోణి నేడు బలహీనపడిందని, దీని ప్రభావంతో కింది స్థాయి గాలులు నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు కుసిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.