అరరే వారం రోజుల ముందు ఎట్లుండె పరిస్థితి..? మొత్తం.. గోడలకు నిమ్మచ్చినట్టు, బర్పుగడ్డల నడుమ బతుకుతున్నమ అన్నట్టే ఉండె గదా సల్లగ. సూర్యుడైతే వినాయక చవితి సెల్వులు తీస్కున్నట్టు మూడురోజులు కనవల్లే. ఇయ్యల్లనే జరంత ఎండపొడ కొట్టింది.
కనీ వచ్చే గీ ఆరం రోజులల్ల తెలంగాణలున్న అన్ని జిల్లాలల్ల జోరుగ పడవోతున్నయట వర్షాలు. ఇయ్యాల్ల, రేపు , ఎల్లుండి ఏమోగనీ 24, 25.. రొండు రోజులైతే మొగులుకు తూటు వడ్డట్టే కురుస్తదట వర్షం . గీ ముచ్చట హైద్రాబాద్ లున్న వాతావరణ శాఖోల్లు జెప్పిన్రు. అందుకే తిప్పలవడ్తరని ముందే జెప్తున్నం…మీ జాగ్రత్తల మీరుండుర్రి..