వానొస్తే ఏపీ సచివాలయం,అసెంబ్లీలో చిత్తడే... - MicTv.in - Telugu News
mictv telugu

వానొస్తే ఏపీ సచివాలయం,అసెంబ్లీలో చిత్తడే…

June 6, 2017

ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఏపీ సచివాలయం, అసెంబ్లీ చాంబర్లకు వరద పోటెత్తింది. మూడు, నాలుగు నెలల క్రితం ప్రారంభమైన ఈ భవంతుల్లోకి వాననీళ్లు వచ్చి చేరుతున్నాయి. భారీ వర్షానికి భవన నిర్మాణాల నాణ్యతలో లోపాలు బయటపడ్డాయి. ఒక్క వర్షానికే ఇలా ఉంటే..ముందు ముందు వానాకాలం పరిస్థితి ఎలా ఉంటుందో…
గుంటూరు, కృష్ణా జిల్లాల్ని భారీ వర్షం ముంచెత్తింది. సచివాలయం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. వర్షం కారణంగా సచివాలయంలోని నాలుగో బ్లాక్ లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్ లో ఉద్యోగుల పనికి ఆటంకం కలిగింది.
అసెంబ్లీ, సచివాలయంలోని పలు బాంబర్లు వర్షపు నీటితో నిండాయి. అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కార్యాలయంలోకి వర్షపు నీరు సన్నటి ధారగా పడుతోంది. దీంతో బకెట్లతో వర్షపు నీటిని సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ ఒక్క వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే..వచ్చేది వానాకాలం.. ఎడతెరపి లేని వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో.. ఊహించడం కష్టం. ఎంతైనా సింగ్ పూర్ డిజైన్ బిల్డింగ్స్ కదా…