రెండు రోజుల్లో భారీ వర్షాలు - MicTv.in - Telugu News
mictv telugu

రెండు రోజుల్లో భారీ వర్షాలు

June 6, 2017


హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ న్యూస్. ఉక్కపోత అల్లాడుతోన్న జనానికి ఉపశమనమిచ్చే చల్లని కబురు. రాబోయే రెండ్రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళవారం మిర్యాలగూడలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా రహదారులు జలమయం అయ్యాయి. సూర్యాపేటలోని మేళ్లచెరువులో ఈదురుగాలులతో కూడిన వానపడింది. ఈదురుగాలులకు బీఎస్‌ఎన్‌ఎల్ సెల్‌ఫోన్ టవర్ కూలిపోయింది.