తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటలకు 30నుంచి 40కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉదయం వాయుగుండంగా బలపడిందని తెలిపారు. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రానున్న 24గంటల్లో దక్షిణ ఒడిస్సా, దక్షిణ చత్తీస్గఢ్ మీదుగా వెళుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.