Hebba Patel dance an item song in the shashana sabha movie
mictv telugu

శాసన సభలో ఐటెం సాంగ్.. హెబ్బా పటేల్ స్టెప్పులు

September 19, 2022

కుమారి 21 ఎఫ్ సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్.. తర్వాత పలు సినిమాల్లో గ్లామర్ పాత్రలో నటించింది. తర్వాత రూటు మార్చి రామ్ రెడ్ సినిమాతో ఐటెం సాంగులు చేస్తోంది. ఇటీవల వచ్చిన ఓదెల రైల్వేస్టేషన్ సినిమాలో డీగ్లామర్ పాత్ర చేసి ప్రశంసలు అందుకొంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది. ‘శాసనసభ’ పేరుతో వస్తున్న పాన్ ఇండియా చిత్రంలో ప్రత్యేక గీతానికి స్టెప్పులేసింది. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్‌గా చేసిన ఈ పాట లిరికల్ వెర్షన్ త్వరలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించగా, మంగ్లీ పాడింది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటిస్తుండగా, వేణు మడికంటి దర్శకత్వం వహిస్తున్నారు.