heeraben modi last rites performed pm modi
mictv telugu

తల్లి పాడె మోసిన ప్రధాని మోడీ

December 30, 2022

heeraben modi last rites performed pm modi

ప్రధాని నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తల్లి మరణానికి ప్రధాని తల్లడిల్లిపోయారు. ఆమె పార్దివదేహం దగ్గర చాలాసేపు కూర్చుని శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత స్వయంగా పాడెను మోసారు మోడీ. ఆమెను తీసుకెళుతున్నంతసేపూ ప్రధాని ఏడుస్తూనే ఉన్నారు.గాంధీనగర్ లోని ముక్తిధామ్ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తల్లి హీరెబెన్ చతికి నిప్పంటించిన మోడీ తరువాత అక్కడి నుంచి వెనదిరిగారు. హీరాబెన్ అంతిమయాత్రకు కుటుంబసభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తన తరలివచ్చారు.

గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో అహ్మదాబాద్‌లోని UN మెహతా హాస్పిటల్‌లో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఇటీవలే హీరాబెన్ వందో పుట్టినరోజు జరుపుకున్నారు. తన తల్లి మరణంపై నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. తన తల్లి ఫొటోను షేర్ చేస్తూ.. నిండునూరేళ్ళు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరిందని మోడీ భావోద్వేగానికి గురయ్యారు.

దేవుడి పాదాల వద్ద అద్భుతమైన శతాబ్ధం ఉంది. సన్యాసి జీవితం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుబడి ఉండే జీవితం వంటి త్రిమూర్తి లక్షణాలు అమ్మలో ఉన్నాయి. 100వ పుట్టిన రోజు సందర్భంగా నేను అమ్మను కలిసినప్పుడు ఆమె ఓ విషయం చెప్పింది. తెలివితో పని చేయండి, స్వచ్చతతో జీవించండి అని చెప్పారు. ఆ విషయాన్ని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను’ అంటూ మోడీ ట్విట్టర్‌లో ఎమోషనల్ అయ్యారు.