ఉత్కంఠబరితంగా బంగ్లాదేశ్-భారత్ మ్యాచ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఉత్కంఠబరితంగా బంగ్లాదేశ్-భారత్ మ్యాచ్

December 4, 2022

బంగ్లాదేశ్, భారత్ మధ్య మొదటి వన్డే ఉత్కంఠ బరితంగా సాగుతుంది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బంగ్లాదేశ్ పోరాడుతుంది. ప్రస్తుతం 44 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఒక్క వికెట్ దూరంలో ఉండగా.. బంగ్లాదేశ్ ఇంకా 14 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజ్‌లో మెహిదీ హసన్, ముస్తిఫిజర్ ఉన్నారు.

ఓటమి తప్పదనుకున్న స్థితి నుంచి అనూహ్యంగా పుంజుకున్న భారత్ చివరి వికెట్ తీసేందకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. బంగ్లా బ్యాటింగ్‌లో లిటన్ దాస్ 41 పరుగులతో రాణించగా, షకీబుల్ హసన్ 29 పరుగులు చేశాడు.మిగతా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. భారత్ బౌలింగ్ లో సిరాజ్ మూడు వికెట్లు, కుల్దీప్ సేన్, సుందర్ రెండు, దీపక్ చాహర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.