పులి ఉంది రండి.. తుపాకులతో వెళ్లిన పోలీసులు, తీరా చూస్తే - MicTv.in - Telugu News
mictv telugu

పులి ఉంది రండి.. తుపాకులతో వెళ్లిన పోలీసులు, తీరా చూస్తే

May 4, 2020

Helicopter, Armed Police Called To Capture Tiger

కొందరు చాలా సహజ సిద్ధంగా విగ్రహాలను తయారు చేస్తారు. దూరం నుంచి చూస్తే అవి నిజమే అనిపిస్తాయి. ఇటీవల అలాంటి ఓ పులి విగ్రహం మార్నింగ్ జాగింగ్ చేసే వాళ్లను బెంబేలెత్తించింది. అక్కడి నుంచి పారిపోయేలా చేస్తోంది. పోలీసులు హెలికాప్టర్ లో తుపాకులతో అక్కడికి వచ్చేలా చేసింది. ఈ సంఘటన యూకేలోని కెంట్ నగరంలో జరిగింది. 

గత శనివారం ఉదయం కొందరు వాకింగ్ చేస్తుండగా పొదల చాటున పులి విగ్రహం కనిపించింది. అది ఎంత సహజ సిద్ధంగా ఉందంటే.. దానిని వాళ్ళు నిజం పులి అనుకున్నారు. భయంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు తుపాకులు తీసుకుని అక్కడికి చేరుకున్నారు. తీరా అది అసలైన పులి కాకపోవడంతో తమలో తాము నవ్వుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ పులి విగ్రహాన్ని రెండు దశాబ్దాల క్రితం 85 ఏళ్ల బామ్మ జూలియట్ సింప్సన్ తయారు చేసింది. ఇంటి దగ్గర పొదల్లో దాన్ని ఉంచింది. పోలీసులు అక్కడికి రావడాన్ని గమనించిన జూలియట్.. తన ఒరిజినల్ చిరుతను చూపించమంటారా? అని పోలీసులతో చమత్కరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.