హెలికాప్టర్‌ను మోసుకెళ్లిన హెలికాప్టర్ (వీడియో)  - MicTv.in - Telugu News
mictv telugu

హెలికాప్టర్‌ను మోసుకెళ్లిన హెలికాప్టర్ (వీడియో) 

October 17, 2020

dvfgbd

హెలికాప్టర్‌ను అత్యవసర ప్రయాణాల కోసం వినియోగిస్తారు. లేదంటే నేతల ప్రయాణాలు, విపత్తు సమయాల్లో బాధితులను తరలించడానికి వాడుతారు. కానీ ఈ హెలికాప్టర్ మాత్రం మరో హెలికాప్టర్‌ను మోసుకెళ్లడానికి ఉపయోగించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు గొలుసులతో కట్టి తరలించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. 

కేదార్‌నాథ్‌ ఆలయం సమీపంలో 2018లో ఇండియన్ ఏయిర్ పోర్స్‌కు చెందిన హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు కిందకు దిగుతుండగా ప్రమాదానికి గురైంది. దాని ముందు భాగం భూమిని తాకింది. మంటలు చెలరేగి ధ్వంసమైపోయింది. రెండేళ్ల క్రితం కూలిన ఈ  శిథిలాలను అదే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఒక చినూక్ హెలికాఫ్టర్ ఢిల్లీకి మోసుకెళ్లింది. దాన్ని బలమైన గొలుసులతో కట్టి తరలించారు. కాగా, ఆనాటి ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణం చేయగా నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ హెలికాప్టర్ రష్యాలో తయారైన MI-17 V5 మోడల్‌కు చెందినది.