ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో క్షేత్రంలో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. హెలిప్యాడ్‌లో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయింది. పైలట్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న వ్యక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గత నెల మే 31 న ఈ ఘటన జరిగింది. వీడియోలో.. ల్యాండింగ్ చేస్తున్నప్పుడు, పైలట్ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోవడం, హెలికాప్టర్ గాలి నుండి భూమికి కదులుతున్నట్లు కనిపిస్తుంది. అయితే, కొన్ని సెకన్ల తర్వాత, పైలట్ పరిస్థితిని గ్రహించి, సురక్షితంగా ల్యాండ్ చేశాడు.
#WATCH A helicopter belonging to a private aviation company while landing at Kedarnath helipad had an uncontrolled hard landing on 31st May; no passengers were injured in the incident#Uttarakhand pic.twitter.com/4yskr0aoz5
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 6, 2022