Helmet saves life from big bus tire
mictv telugu

వామ్మో.. ఇది చూస్తే తప్పకుండా హెల్మెట్ పెట్టుకుంటారు!

July 21, 2022

Helmet saves life from big bus tire

హెల్మెట్ వాడండయ్యా బాబూ అని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా చాలామంది పెడచెవిన పెడుతున్నారు. తమ నిర్లక్ష్యం వల్ల కొందరు, వేరే వాళ్ల నిర్లక్ష్యం వల్ల కొందరు.. కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల నెత్తురోడి చనిపోతున్నారు. హెల్మెట్ అన్ని ప్రమాదాల నుంచి కాపాడకపోయినా డెత్ రిస్క్‌ను మాగ్జిమం తగ్గిస్తుంది. అందుకు ఈ వీడియోనే ఉదాహరణ.

ఇందులో ఓ బైక్ రైడర్ అతి వేగంగా వచ్చేసి ఎదురుగా వస్తున్న బస్సు వెనక టైరు కింద పడతాడు. తలకాయ సరిగ్గా టైరు కిందికి వెళ్తుంది. అయితే అతనికి భూమ్మీద నూకలుంబట్టి బతికిపోతాడు. నాణ్యమైన హెల్మెట్‌ అతని తల బద్దలు కాకుండా కాపాడింది. హెల్మెట్ పెట్టుకున్నామా అంటే పెట్టుకున్నామని కాకుండా ఐఎస్ఐ బ్రాండున్న మంచి క్వాలిటీ హెల్మెట్ ను పెట్టుకుంటే ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడొచ్చు. కర్ణాటక ఐపీఎస్ అధికారి రవికాంతె గౌడ ఈ వీడియోను షేర్ చేశారు.