వాహనదారులకు పోలీసుల సీరియస్ వార్నింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

వాహనదారులకు పోలీసుల సీరియస్ వార్నింగ్

December 21, 2021

03

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు జరిగి, వాహనదారులు తమ ప్రాణాలు కోల్పోతున్నారని, దీనికి ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవటమేనని హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీసులు సీరియస్ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్ ధరించటంపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టిన వాహనదారులు తీరుమాత్రం మారటం లేదన్నారు. ఇక నుంచి ‘హెల్మెట్ లేకుండా బైక్ తీస్తే, తాట తీస్తామని, కేసులు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు’.

హెల్మెట్ లేకుండా ప్రయాణించేందుకు ఏమాత్రం అనుమతి ఉండదన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికి వరకు హెల్మెట్ లేని వాహనదారులపై 11,54,463 కేసులు నమోదు చేశామన్నారు. ఈ నెల 4 నుంచి 11వ తేదీ మధ్య ప్రత్యేక తనిఖీ కార్యక్రమం చేపట్టీ, 27,306 కేసులను నమోదు చేశామన్నారు. అంతేకాకుండా బైక్‌పై వెనక కుర్చోని ప్రయాణిస్తున్న వ్యక్తి సైతం తప్పకుండా హెల్మెంట్ ధరించాలన్నారు. హెల్మెట్ ధరించని పక్షంలో విడివిడిగా చలాన్లు విధిస్తామని ట్రాఫిక్ విభాగం డీసీపీ ఎల్‌ఎస్ చౌహాన్ వార్నింగ్ ఇచ్చారు. వాహనంపై చిన్న పిల్లలను తీసుకెళ్లిన వారికి కూడా హెల్మెట్ పెట్టాలని సూచించారు.