వీళ్లను జూశి సిగ్గు తెచ్చుకోండి..! - MicTv.in - Telugu News
mictv telugu

వీళ్లను జూశి సిగ్గు తెచ్చుకోండి..!

July 26, 2017

బండిమీద పొయ్యెటప్పుడు హెల్మెట్ పెట్కపోండ్రా అని శిల్కకు జెప్పినట్టు  జెప్పినా,ఫైన్లేశినా ఎవ్వలింటలేరని… హెల్మెట్ వెట్టుకోకపోతే ఏమైతదో అడ్వటేజ్ మెంట్లు జేశి… సిన్మ టాకీస్లల్ల ఏస్తున్రు,పాటలు పాడిపిచ్చి జెప్తున్రు, పోస్టర్లు కొట్టిస్తున్రు, హెల్మెట్ పై ఎన్నో అవేర్ నేస్ ప్రోగ్రాంలు వెట్టి జెప్తున్రు, ,ఇట్ల పబ్లిక్కు ఎన్ని  రకాలుగ జెప్తె అర్ధమైతదో అన్ని  దారుల్ల చెప్పుతున్నరు దేశంలున్న  అన్ని సర్కారోళ్లు,అయినా  ఇనటోడు ఇంటుండు…హెల్మెట్ వెట్కోకుంట పోయి  నెత్తులు పల్గి సచ్చెటోడు సస్తుండు.

మొన్ననే  మనకాడ నిజాంబాద్ ఎంపి కవితక్క గుడ ఈ రాఖీ పండుగకు  ప్రతి శెల్లెగుడ తన అన్నకు ఓ హెల్మెట్ గిఫ్ట్ ఇయ్యుండ్రని కొత్త ఆలోశనకు శ్రీకారం జుట్టింది,ఈళ్లందరు ఇన్ని తీర్ల జెప్పేది ఎవలకోసం అనేది  నెత్తికి హెల్మెట్ శిప్పలు వెట్కోనోళ్లు  ఆలోశన జెయ్యాలే,హెల్మెట్ వెట్కోకుంట బండిమీద రయ్యున వొయ్యెటోళ్లు కొందరైనా మారుతరని  మేం గుడ గీ ఫోటోవెడ్తున్నం,కనీసం గీ పోట్వను జూశైనా శిగ్గు తెచ్చుకోండ్రి,ప్రాణం ఎంత విలువైనదో  ఆ తల్లికి తెల్సు కాబట్టే  తన బిడ్డలకు  హెల్మెట్ తోని  రక్షణ కల్పించింది.ఇగ ఇదిజూశి గుడ…మారకుంట, నా జుట్టు ఊశిపోతది,హెల్మెట్ పెట్టుకుంటే ఉబ్బరి పోస్తది,అని సాకులు జెప్పి మీసావు మీరు సస్తా అంటే ఎవలు మాత్రం ఏం జెస్తరు కదా…శెప్తిననోన్ని శెడంగ జూశే కథనే అయితది.