కేన్సర్ కోరల నుంచి మంచిర్యాల చిన్నారిని కాపాడుకుందాం.. - MicTv.in - Telugu News
mictv telugu

కేన్సర్ కోరల నుంచి మంచిర్యాల చిన్నారిని కాపాడుకుందాం..

July 11, 2019

Help manciarial cancer victim nalla joshmita to fast recovery...

 పదకొండేళ్ల చిన్నారి.. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతోంది. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. అతి సామాన్యులైన తల్లిదండ్రులు ఆ పాపను కాపాడుకోడానికి శాయశక్తులా పోరాడుతున్నారు. ఆస్తులు అమ్మి అప్పులు చేసి ఇప్పటికే 12 లక్షలు ఖర్చు పెట్టారు. కానీ ఆ కేన్సర్ వ్యాధి శాంతించడం లేదు. దీంతో విధిలేక సాయం చేయండంటూ చేతులెత్తి అర్థిస్తున్నారు. 

మంచిర్యాల పట్టణానికి చెందిన నల్ల శ్రీనివాస్ పెద్ద కుమార్తె ఏపెండెమోవా గ్రేడ్ 2 కేన్సర్ కణితితో బాధపడుతోంది. ఆమెకు ఇప్పటికే రెండుసార్లు ఆపరేషన్ చేశారు. మొదటిసారి హైదరాబాదులో, రెండోసారి చెన్నై అపోలో హాస్పిటల్లో సర్జరీ చేశారు. ఇప్పటివరకు చికిత్స కోసం 12 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఆపరేషన్ తరువాత జోష్మితకు రేడియేషన్ థెరపి చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. ఈ చికిత్స ద్వారా జోష్మితకు పూర్తిగా నయం అవుతుందని చెప్పారు. థెరపీకి సుమారు 30 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. చిన్న బట్టల దుకాణం నడుపుకునే తండ్రి శ్రీనివాస్ మిత్రుల నుంచి, దాతల నుంచి సాయం కోరుతున్నారు. చిన్నారి చికిత్స కోసం సాయం చేయాలనుకునేవారు విరాళాలు పంపాల్సిన అకౌంట్ నంబర్ కింద ఇస్తున్నాం. 

Vedam radhakrishna 

AC no 07431000044802 

IFSC code HDFC0000743 

Google pay number 9849575926