Helped fulfill BJP's political agenda at cost of Constitution: Mehbooba Mufti slams Ram Nath Kovind
mictv telugu

రాంనాథ్ కోవింద్‌పై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

July 25, 2022

భారతదేశ 14 వ రాష్ట్రపతిగా నిన్నటివరకూ సేవలందించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌ను వీడారు. ఢిల్లీ జన్‌పథ్ రోడ్డులోని తన కొత్త నివాసానికి ఆయన తన కుటుంబ సమేతంగా చేరుకున్నారు. అంతకు ముందు దేశ 15వ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయడం తెలిసిందే. ఇదిలా ఉండగా రాంనాథ్ కోవింద్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ భారత రాజ్యాంగాన్ని పణంగా పెట్టి బీజేపీ రాజకీయ ఎజెండాను అమలు చేశారన్నారు. సోమవారం సోషల్ మీడియా వేదికగా ఈ కామెంట్స్ చేశారు. పదేండ్లపాటు భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి వారసత్వాన్ని మిగిల్చారు’’ అని ముఫ్తీ అన్నారు. రాంనాథ్ హయాంలో దేశ రాజ్యాంగం పలుసార్లు ఉల్లంఘనకు గురైయ్యిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ బిల్లును ప్రస్తావిస్తూ రాంనాథ్ కోవింద్‌ను టార్గెట్ చేశారు. అలాగే మైనార్టీలు, దళితులపై దాడుల అంశాలను మెహబూబా ముఫ్తీ తన ట్వీట్‌లో ప్రస్తావించారు.