అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకు హెల్త్ కార్డులు....! - MicTv.in - Telugu News
mictv telugu

అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకు హెల్త్ కార్డులు….!

July 31, 2017

అక్రెడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది,ఇవ్వాళ సమాచార శాఖ కమీషనరు కార్యాలయం లో అల్లం నారాయణ అధ్యక్షతన  జరిగిన సమావేశం లో   వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు అందించాలని కమిటీ నిర్ణయించింది. దీనికోసం సదరు సంస్థలో పనిచేస్తున్న ఆధారాలు , అనుభవంతో ఆగస్టు 16  లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫారాలు ఐ అండ్ పీఆర్ వెబ్ సైట్ లో గానీ , డీపీఆర్వో కార్యాలయాల్లో నేరుగా గానీ  పొందవచ్చు . హెల్త్ కార్డ్ లేని జర్నలిస్ట్ లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని టి యు డబ్ల్యూ జె కోరుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రం లో 14114 మంది జర్నలిస్ట్ లకు హెల్త్ కార్డ్స్ యూసర్ ఐడి, పాస్ వార్డ్ పంపించగా వారిలో 5798 మంది మాత్రమే కార్డ్స్ డౌన్ లోడ్ చేసుకోగా 8316 మంది ఇంకా వారి కార్డ్స్ ని డౌన్ లోడ్ చేసుకోలేదట. అలాంటి వారు కూడా వెంటనే హెల్త్ కార్డ్స్ ని డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పారు టి యు డబ్ల్యూ జె. ప్రధాన కార్యదర్శి  క్రాంతి.