చెల్లెలు బాధపడుతోందని హేమంత్ హత్య.. నెల కిందటే కుట్ర - MicTv.in - Telugu News
mictv telugu

చెల్లెలు బాధపడుతోందని హేమంత్ హత్య.. నెల కిందటే కుట్ర

September 26, 2020

hemant avanti case hyderabad

శుక్రవారం జరిగిన హేమంత్ కుల హత్యలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవంతి, హేమంత్‌ వివాహంతో ఆమె తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చనలు అవమానంతో రగిలిపోయారు. అర్చన తన కూతురు వివాహం గురించి తన అన్న యుగంధర్‌రెడ్డి దగ్గర గోడు వెళ్లబోసుకుంది. ఈ పెళ్లి జరిగినప్పటి నుంచి నాలుగు నెలల పాటు వాళ్ళు ఇంట్లోనే ఉండిపోయారు. దీంతో తన చెల్లి బాధ చూడలేక అవంతిని హేమంత్‌ నుంచి విడదీయాలని యుగంధర్‌రెడ్డి నిర్ణయించుకున్నాడు. నెల రోజుల క్రితమే హేమంత్‌ని చంపడానికి లక్ష్మారెడ్డి, యుగంధర్‌రెడ్డిలు పథకం రచించారు. నెల రోజుల ముందే అందుకోసం రెక్కి కూడా చేశారు. గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో హేమంత్ నివాసమున్న హేమంత్ ఎలా చంపాలి ఎలా కిడ్నాప్ చేయాలన్న దానిపై యుగంధర్‌రెడ్డి ప్లాన్ సిద్ధం చేశాడు. 

సుపారీకి హత్యలు చేసే రాజు, కృష్ణ, పాషాలతో పలుమార్లు యుగంధర్ చర్చించాడు. తొలుత మాటలతో అవంతిని తమ వైపు తిప్పుకోవాలని తండ్రి లక్ష్మారెడ్డి అనుకున్నాడు. ఈ మేరకు నెల రోజులుగా ప్రయత్నం చేశారు. అయినా ఆమె లొంగలేదు. దీంతో హేమంత్ ను హతమార్చాలనే నిర్ణయానికి వచ్చారు. ఈనెల 24 మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డ 12 మంది బంధువులు, కిరాయి హంతకులు హేమంత్‌, అవంతిపై దాడి చేస్తూ బలవంతంగా కారులో ఎక్కించారు. లింగంపల్లిలో మాట్లాడుకుందామని కారు గోపన్‌పల్లి వైపు మళ్లించారు. గోపన్‌పల్లి వద్ద కారు నుంచి అవంతి, హేమంత్‌ తప్పించుకున్నారు. పారిపోతున్న వారిద్దరినీ పట్టుకున్నారు. అదే రోజు రాత్రి 7.30గంటలకు కారులోనే హేమంత్‌ను హతమార్చారు. ఈ రోజు లింగంపల్లి స్మశానవాటికలో హేమంత్ అంత్యక్రియలు నిర్వహించారు.