హేమంత్ హత్యకు రూ. 10 లక్షల సుపారీ, అడ్వాన్స్ ఎంతంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

హేమంత్ హత్యకు రూ. 10 లక్షల సుపారీ, అడ్వాన్స్ ఎంతంటే..

September 25, 2020

Hemant case in hyderabad

2018లో యావత్ దేశం సంచలనం రేపిన మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య తరహాలో హైదరాబాద్ నగరంలో ఈరోజు మరో హత్య జరిగింది. కూతురు కులాంతర ప్రేమ వివాహం చేసుకుందని అల్లుడిని హత్య చేయించాడు ఓ కసాయి తండ్రి. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. చందానగర్‌లో ఉండే హేమంత్ అనే యువకుడు ఇదే ప్రాంతానికి చెందిన అవంతిరెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అవంతిరెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి ఈ పెళ్ళి పట్ల కోపంగా ఉన్నాడు. కొన్నిరోజులుగా వీరిద్దరూ గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అవంతి మేనమామ యుగంధర్‌తో కలిసి హేమంత్‌ను హతమార్చాడు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. హేమంత్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అవంతి మేనమామ యుగంధర్‌తో పాటు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. హేమంత్ హత్య కోసం చందానగర్‌కు చెందిన ఇద్దరు కిరాయి వ్యక్తులకు రూ. 10 లక్షలు ఇచ్చినట్లు పోలీస్ విచారణలో యుగంధర్ తెలిపాడు. వాటిలో 7 లక్షలు అడ్వాన్స్ ఇచ్చానని.. మిగతా మూడు లక్షలు హత్య చేశాక ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. హేమంత్ ను హత్య చేసిన ఇద్దరు కిరాయి వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిన్న యుగంధర్ స్వయంగా హేమంత్‌, అవంతిక నివాసముంటున్న ప్రాంతానికి వెళ్లి వారిద్దరిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తుండగా యువ జంట ఇద్దరు కారులో నుంచి దూకారు. దీంతో అవంతికను అక్కడే వదిలిపెట్టి యుగంధర్ మరో ఇద్దరు వ్యక్తులతో తన కారులో హేమంత్‌ను తీసుకెళ్లి హత్య చేశారు.