తండ్రి ఇంటి వద్ద ధర్నాకు అవంతి యత్నం.. ఉద్రిక్తత - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రి ఇంటి వద్ద ధర్నాకు అవంతి యత్నం.. ఉద్రిక్తత

September 28, 2020

Hemant caste tragedy wife avantika protest

హేమంత్ కుల హత్య ప్రకంపనలు సృష్టిస్తోంది. హైదరాబాద్ చందానగర్‌లోని హేమంత్ ఇంటి వద్ద ఈ రోజు సాయంత్రం అతని భార్య అవంతిక, కుటుంబసభ్యులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తర్వాత అవంతిక తండ్రి లక్ష్మారెడ్డి ఇంటివైపు వెళ్లడానికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

వైశ్య కులానికి చెందిన హేమంత్‌ను రెడ్డి కులస్తురాలైన అవంతికను ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టలేని ఆమె కుటుంబసభ్యులకు సుపారీ ఇచ్చి అతణ్ని చంపించడం తెలిసిందే. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ హేమంత్‌ నివాసం వద్ద ధర్నా నిర్వహించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, సకాలంలో దర్యాప్తు పూర్తి చేయాలి డిమాండ్ చేశారు. ‘జస్టిస్ ఫర్ హేమంత్’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ నారాయణ కూడా పాల్గొన్నారు.  తర్వాత ఆందోళనకారులు ఎదురుగా ఉన్న లక్ష్మారెడ్డి నివాసం దూసుకెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు మొత్తం 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 8 ఏళ్ల పాటు ప్రేమించుకున్న హేమంత్, అవంతికలు నాలుగు నెలల కిందట పెళ్లి చేసుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని ఆమె కుటుంబసభ్యులు, బంధువులు కిడ్నాప్ చేసిన అతణ్ని చంపేశారు.