కేసీఆర్‌కు హేమంత్ సొరేన్ ఝలక్ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌కు హేమంత్ సొరేన్ ఝలక్

March 6, 2018

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  తనతో కలసి వచ్చే ప్రాంతీయ పార్టీలతో థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, జేఎంఎం నేత హేమంత్ సొరేన్, మహారాష్ట్రకు చెందిన ఆరుగురు ఎంపీలు ఆయన మద్దతు ప్రకటించారు. అయితే హేమంత్ వెంటనే సొరేన్ నిర్ణయం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన కాంగ్రెస్‌తో పొత్తుకు ఉవ్విళ్లూరుతున్నారు. కేసీఆర్ ప్రకటనను ఇంకా పరిశీలిస్తున్నామని, నిర్ణయం తీసుకోలేదని హేమంత్ మంగళవార అన్నారు.

వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేద్దామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రతిపాదించాని సొరేన్ తెలిపారు. జార్ఖండ్‌లో జేఎంఎం సారథ్యంలో కాంగ్రెస్ పోటీకి వెళ్తుందని రాహుల్ అన్నారన్నారు. కాంగ్రెస్‌తో చర్చలు సాగుతున్నాయని, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌పై ఇప్పుడు కాకుండా తమ పార్టీ సభ్యులతో చర్చించాకే ఏమాటా చెబుతామన్నారు. కాగా, జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని సొరేన్ ఇదివరకు స్వాగతించారు. రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్న ఇతర రాష్ట్రాల్లోని వారితో కూడా సంప్రదించి అందరం కలిసి ముందుకు సాగుదామంటూ ఆయనకు ఫోన్ చేశారు కూడా.