ప్రాణం కంటే పరువే ముఖ్యం.. అవంతి తండ్రి - MicTv.in - Telugu News
mictv telugu

ప్రాణం కంటే పరువే ముఖ్యం.. అవంతి తండ్రి

October 1, 2020

Hemanth Case Police Enquiry

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసు నిందితుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు గల కుట్రపై పోలీసులు గచ్చిబౌలి పోలీసులు అడిగిన ప్రశ్నలకు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి సంచలన విషయాలను వెల్లడించాడు. తమకు ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావించామని అందుకే హేమంత్‌ను చంపేయాల్సి వచ్చిందని చెప్పాడు. 

హేమంత్‌, అవంతి  ప్రేమ విషయం తెలిసిన వెంటనే ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేశామని తెలిపాడు. ఆ తర్వాత ఓ రోజు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుందన్నాడు. అప్పటి నుంచి తాము నలుగురిలో తలెత్తుకోలేకపోయామని వాపోయాడు. తన కుటుంబం ప్రాణం కంటే పరువే ముఖ్యంగా భావిస్తుందన్నాడు. ఊరిలో పరువు పోయిందనే ఆవేదనతో చంపేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వివరించాడు. కాగా, రెండు రోజులుగా అతన్ని పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.  మరిన్ని విషయాలను రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తమకు ప్రాణహాని ఉందంటూ అవంతి, హేమంత్ కుటుంబ సభ్యులు సీపీని కలిసిన సంగతి తెలిసిందే.