రాధారాణివి పచ్చి అబద్ధాలు.. బీజేపీ నేత రఘునందన్ - MicTv.in - Telugu News
mictv telugu

రాధారాణివి పచ్చి అబద్ధాలు.. బీజేపీ నేత రఘునందన్

February 4, 2020

M Raghunandan Rao.

ఆఫీసుకు పిలిచి కాఫీలో మత్తు మందు కలిపి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బీజేపీ నేత ఎం రఘునందన్ రావుపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లాకు చెందిన రాధారమణి అనే మహిళ తన భర్తతో కలిసి రఘునందన్ తనపై ఘాతుకానికి పాల్పడ్డారని సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఆరోపణలపై సదరు బీజేపీ నేత రఘునందన్ రావు స్పందించారు. ఆ మహిళ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, నూటికి నూరు శాతం అవన్నీ పచ్చి అబద్ధాలేనని తెలిపారు. తనమీద ఎందుకు ఆరోపణలు వస్తున్నాయో తెలియడంలేదని వాపోయారు.  తాను ఏ తప్పూ చేయలేదని, ఇందకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మరోసారి వివరణ ఇస్తానని చెప్పారు. తనకు ఈ వ్యవహారంలో ఎవరూ నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు.

కాగా, 2007 నుంచి రఘునందన్ తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని రాధారాణి ఆరోపిస్తున్నారు. కేసుల పరిష్కారం కోసం వచ్చే మహిళలను రఘునందన్ బెదిరించి లొంగదీసుకుంటారని.. దీనిపై ఆమె సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బ్లూ ఫిలింస్ బిజినెస్ చేస్తున్నారు

మంగళవారం (ఫిబ్రవరి 4) సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో బాధితురాలు మీడియాతో మాట్లాడారు. రఘునందన్‌తో పాటు, శ్రీనివాస్, వెంకటేశ్వర రావు అనే వ్యక్తులు బ్లూ ఫిలింస్ బిజినెస్ చేస్తున్నారని ఆమె తెలిపారు. వారికి డ్రగ్స్ బిజినెస్ కూడా ఉందని ఆమె ఆరోపించారు. ఏకవచనంతో సంబోధిస్తూ రఘునందన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నేను ఎక్కడ కేసు పెట్టినా.. రఘునందన్ అక్కడికి వచ్చి వెనక్కి తీసుకోమని బ్లాక్ మెయిల్ చేశాడు. పోలీసులను ప్రభావితం చేశాడు. పోలీసుల సాయంతో నా కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ అన్నీ మార్చేశాడు. సీసీఎస్ పోలీసులు కేసు క్లోజ్ చేశారు. ఎక్కువ మాట్లాడితే ఎన్‌కౌంటర్ చేస్తామని ఓ సీఐ నన్ను ఎన్నోసార్లు బెదిరించాడు. నాకు అన్యాయం చేస్తారా? కొడితే భరించాలా? చంపేస్తే చచ్చిపోవాలా.. కొన్నేళ్లుగా రఘునందన్ నన్ను టార్చర్ పెడుతున్నాడు. ఎక్కడ ఉద్యోగంలో చేరుతున్నా తీయిస్తున్నాడు. షాప్ పెట్టుకున్నా యజమానులకు లేనిపోనివి చెప్పి తీయించాడు. రఘునందన్‌తో నాకు, నా కుమారుడికి ప్రాణ హాని ఉంది. ప్రాణాలను కాపాడుకునే ఉద్దేశంతోనే జర్నలిజం వైపు వచ్చాను. నేను మొదటి నుంచి జర్నలిస్టును కాను. ప్రస్తుతం ఫ్రీ లాన్సర్‌గా పనిచేస్తున్నాను’ అని రాధారమణి అన్నారు.