గోదారమ్మా మా బిడ్డను ఇవ్వమ్మా.. తీరని రమ్య తల్లిదండ్రుల రోదన - MicTv.in - Telugu News
mictv telugu

గోదారమ్మా మా బిడ్డను ఇవ్వమ్మా.. తీరని రమ్య తల్లిదండ్రుల రోదన

October 24, 2019

Her parents are still crying after Ramya's body is not found

ఎంతో భవిష్యత్తు ఉన్న కన్నబిడ్డ గోదావరి బోటు ప్రమాదంలో మరణించింది. కుమార్తె మరణించిందని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు. తమ బిడ్డ శాశ్వతంగా తమను వదిలి వెళ్లిందని గుండె దిటవు చేసుకున్నారు. కనీసం తమ బిడ్డ  మృతదేహం దొరికితే చాలని 40 రోజులుగా వారు అక్కడే ఉండి ఎదురుచూస్తున్నారు. గోదారమ్మ కరుణించి తమబిడ్డ పార్థీవదేహాన్ని తమకు ఇవ్వాలని నిత్యం గోదారమ్మను వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాయల్ వశిష్ఠ బోటును ధర్మాడి సత్యం బృందం బయటకు తీసిన విషయం తెలిసిందే. బోటు బయటకు వస్తే తమ బిడ్డ మృతదేహం కూడా బయటకు వస్తుందని ఎంతో ఆశించారు వాళ్లు ఆ కన్నవాళ్ళు. 

కానీ, వారి ఆశ నెరవేరలేదు. వారి కడుపుతీపి చేదు అయింది. దీంతో వారు మరింత రోదిస్తున్నారు. ఈ క్రమంలో వారికి కన్నీరే కరువయ్యింది. గత నెల 15న పాపికొండల విహార యాత్రలో జరిగిన పడవ ప్రమాదంలో  కారుకూరి రమ్య(22) గల్లైంతైన విషయం తెలిసిందే. 

తమ బిడ్డను గోదారమ్మ శాశ్వతంగా తన ఒడిలోనే దాచుకుందని దుఖ్ఖిస్తున్నారు. కడతేరని దుఖ్ఖం వారిది. బిడ్డ మృతదేహం కోసం వారు గోదావరి ఒడ్డున కూర్చుని నిద్రాహారాలు మానుకుని ఎదురుచూస్తున్నారు. అయినా వారి ఆశలు ఫలించలేవు. మీ బిడ్డ ఇకపై నా బిడ్డ అన్నంత పనే చేసింది గోదారమ్మ? మంగళవారం బోటును వెలికితీయగా అందులో ఎనిమిది మృతదేహాలు లభించాయి. లభించిన మృతదేహాల్లో ఓ చిన్నారి మృతదేహం, మరో వ్యక్తి మృతదేహాన్ని గుర్తుపట్టడం సాధ్యం కాలేదు. ఒంటిపై దుస్తులు కూడా లేకపోవడం పూర్తిగా శరీర అవయవాలు చేపలు తినేశాయి. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రమేష్‌ కిశోర్‌ తెలిపారు.

వాటిలోనూ రమ్య మృతదేహం కనిపించకపోవడంతో వారు గుండెలు బాదుకుని రోదించడం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. రమ్య మృతదేహం కోసం తల్లిదండ్రులకు తోడుగా వెళ్లిన బంధువుల్లో కొందరు వెనుదిరగగా వారు మాత్రం బిడ్డ ధ్యాసలో అక్కడే ఉండి ఎదురుచూస్తున్నారు. 

కాగా, రమ్యది మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నంనూరు గ్రామం. విద్యుత్ శాఖ ఉద్యోగి కారుకూరి సదర్శన్, భూమక్కల కుమార్తె ఆమె. విద్యుత్ శాఖలో రమ్య ఏఈగా ఇటీవలే ఉద్యోగంలో చేరారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ సబ్ డివిజన్‌లో రమ్య సబ్ ఇంజనీరుగా విధులు నిర్వహిస్తున్నారు. మొదటినెల జీతం అందుకుని.. ఆ తొలిజీతంతో సరదాగా పాపికొండలు సందర్శంచి వద్దామని వెళ్ళారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లి మృత్యువాత పడ్డారు.