Here Are India's Most Anticipated Upcoming Motorcycles For 2023
mictv telugu

త్వరలో రాబోతున్న మోటర్ సైకిళ్లు ఇవే..!!

January 5, 2023


రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ నుంచి ఆల్ న్యూ బజాజ్, పల్సర్ పీ 150 వరకు గత సంవత్సరం మోటర్ సైకిల్లను చూశాం. బ్యాక్ టు బ్యాక్ ఈ బైక్ లు అందరినీ ఆకర్షించాయి. సరిగ్గా జరిగితే ఈ సంవత్సరం ప్రపంచ స్థాయి మోటర్ సైకిళ్ల అద్భుతమైన లాంచ్ లను చూడబోతున్నాం. 2023లో భారతీయ రోడ్ల పైకి రానున్న మోటరు సైకిళ్ల లిస్ట్ ఇది..

రాయల్ ఎన్ ఫీల్డ్ సూపర్ మీటోర్ 650
భారతదేశంలో అత్యంతంగా ఎదురుచూస్తున్న బైక్‌లలో ఇది ఒకటి. 2022 నవంబర్ రైడర్ మానియాలో ఈ బైక్ కనిపించింది. కానీ ఈ నెలలోనే దీన్ని అధికారంగా ప్రారంభిస్తున్నారు. సూపర్ మీటోర్ 650లో 648సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్, సోవా అప్ సైడ్ డౌన్ ఫోర్క్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, అల్యూమినియం విడిభాగాలు ఉన్నాయి. ఇది ఆర్కిటిపాల్ క్రూయిజర్. 1,500ఎం.ఎం వీల్ బేస్‌తో తక్కువ ప్రొఫైల్ కలిగి ఉంది. డిజైన్ చిన్న మీటోర్ 350 మాదిరిగానే ఉంటుంది. అయితే ఇది మరింత ప్రీమియం, అద్భుతమైనదిగా కనిపిస్తుంది. ఈ ఇంజన్ 47బీహెచ్పీ, 54ఎన్ఎమ్ ని అభివృద్ధి చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ తో స్లిప్పర్ క్లచ్ జత చేయబడింది. రాయల్ ఎన్ ఫీల్డ్ మీటోర్ 650 ధర సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల రూపాయల(ఎక్స్ షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.

రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350
రాయల్ ఎన్ ఫీల్డ్ త్వరలో క్లాసికల్ 350, హంటర్ 350, మీటోర్ 350 వంటి ఇతర ఆర్ఈ బైక్‌లలో ఉపయోగించే కొత్త జే -సిరీస్ ఇంజిన్‌తో తదుపరి తరం బుల్లెట్ 350 విడుదల చేసే అవకాశం ఉంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే.. కొత్త బుల్లెట్ ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ తో పాటు కొత్త ఇన్ర్స్టుమెంట్ క్లస్టర్నుపొందే అవకాశం ఉంది. కొత్త బుల్లెట్ ధర రూ.1.7 లక్షలు ఎక్స్ షోరూమ్ గా అంచనా వేయబడింది. దీని కిక్ స్టార్ వెర్షన్ రూ. 1.48 లక్షలతో మొదలై రూ. 1.63 లక్షల వరకు ఉంటుంది.

రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450
రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 411 ప్రస్తుతం భారతీయ రైడర్లలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆఫ్ రోడ్ బైక్‌లలో ఒకటి. కంపెనీలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ లో టాప్ లో ఉంటుంది. ఈ సంవత్సరం 450సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్, 6 స్పీడ్ గేర్ బాక్స్‌తో దాని అప్ గ్రేడ్ వెర్షన్ ను విడుదల చేయనుంది. ఇది దాదాపు 30బీహెచ్పీ, 40ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం 411లో అమ్చరినట్లే అదే 21 అంగుళాల ముందు, 17 అంగుళాల వెనుక చక్రాల సెటప్ తో తీసుకురానున్నారట. కానీ ట్యూబ్‌లెస్ స్పోక్డ్ రిమ్ లతో వస్తుందని అంచనా. ఇక దీని ధర 2, 60, 000 నుంచి 2, 70, 000 రూపాయాల వరకు ఉండవచ్చు.

హీరో ఎక్స్ పల్స్ 400
బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ కోసం చూస్తున్నారా? అయితే ఇంకా కొంచెం వేచి చూడాల్సిందే! ఎందుకంటే హీరో మోటోకార్ప్ ఈ సంవత్సరం రాయల్ ఎన్ ఫీల్డ్ తో నేరుగా పోటీ పడేందుకు అత్యంత ఎదురుచూస్తున్న బైక్‌లలో ఒకటైన ఎక్స్ పల్స్ 400ని విడుదల చేయనుంది. భారతీయ మార్కెట్లో దీని ధర రూ.1.7 లక్షల నుంచి రూ.1.9 లక్షల వరకు ఉంటుంది. ఈ బైక్ 35బీహెచ్పీ నుంచి 40 బీహెచ్పీ పవర్ రేంజ్, ముందు వైపు అప్ సైడ్ డౌన్ ఫోర్క్‌లు, ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ తో వెనుక వైపు మోనోషాక్ కలిగి ఉంటుందని అంచనా. మోటర్ సైకిల్ ట్యూబ్ టైప్ 21 అంగుళాల వీల్ ఉంటుంది.

ట్రంఫ్ – బజాజ్
బజాజ్ ఆటో, ట్రంఫ్ మోటర్ సైకిల్స్ త్వరలో కొత్త మిడ్ కెపాసిటీ స్క్రాంబ్లర్ బైక్ ను విడుదల చేయనున్నాయి. అంతకుముందు అక్టోబర్ లో ఈ బైక్ టెస్టింగ్ జరిగింది. ఇది 350సీసీ బైక్ అని ఊహాగాలున్నాయి. రెట్రో స్టైల్ గా ఉండే ఈ బైక్ కి రౌండ్ హెడ్ ల్యాంప్‌లు, చిసెల్డ్ ఫ్యూయల్ ట్యాంక్, రౌండ్ రియర్ వ్యూ మిర్రర్ లు ఉంటాయి. మోనో షాక్ సస్పెన్షన్ సెటప్ బైక్ వెనుక భాగంలో చూడవచ్చ. మోటర సైకిల్ ముందు , వెనుక వైపు 19 అంగుళాలు, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ చూడొచ్చు. దీనికి 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉందచవ్చు. ట్రంఫ్ బజాజ్ స్క్రాంబ్లర్ సుమారు 2.55 లక్షల రూపాయలు ( ఎక్స్ షోరూమ్) ధర ఉండవచ్చని అంచనా. అలాగే ఇది ఫిబ్రవరి వరకు భారత రోడ్ల మీద కనిపించొచ్చు.

2023 కేటీఎమ్ 390 డ్యూక్
ఈ మోటర్ సైకిల్ అనేక కొత్త ఫీచర్లతో మన ముందుకు రానుంది. హెడ్ లైట్ ఫ్లాట్ ఇష్ గ్లాస్ కు బదులుగా, బైక్ వంకరగా ఉటుంది. ఇది చిన్నడీఆర్ఎల్ లు, ప్రకాశవంతమైన బెజెల్ లు, నవీకరించబడిన ఫ్రంట్ ఎండ్, పదునైన ట్యాంక్ పొడిగింపులను కూడా కలిగి ఉంటుంది. ఇది రాబోయే మోడల్ కేటీఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ బైక్ లాగా కనిపిస్తుంది. ఈ బైక్ ఫ్యూయల్ ఇంజెక్ట్ చేయబడిన సింగిల్ సిలిండర్ 373సీసీ ఇంజిన్ ను కలిగి ఉండవచ్చని భావిస్తుంది. ఈ ఇంజన్ 9,000ఆర్పీఎమ్ వద్ద 43 బీహెచ్పీ, 7,000ఆర్పీఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ బైక్ ధర సుమారు 3.4 లక్షల రూపాయాల వరకు ఉండవచ్చని అంచనా.

ట్రంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ రేంజ్
ఈ బైక్ 2022లో అప్ డేట్ చేశారు. ఇది త్వరలోనే భారతదేశంలో అందుబాటులో ఉండనుంది. కొత్త స్ట్రీట్ ట్రిపుల్ మూడు వేరియంట్లతో విడుదల చేయబడుతుంది. అవి.. ఆర్, ఆర్ ఎస్, మోటో 2. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ 765సీసీ ఇన్లైన్ త్రీ సిలిండర్ ఇంజన్ తో పాటు, 120 బీహెచ్పీ శక్తిని, 80ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే ఇంజిన్ తో ఆర్ఎస్, మోటో 2 ఎడిషన్లు 130 బీహెచ్పీ, 80 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, పగటిపూట రన్నింగ్ లైట్లతో రీ డిజైన్ చేయబడింది. ఇవి కాకుండా.. సరికొత్త కనెక్టివిటీతో కూడా టీఎఫ్టీ ఇన్స్ర్టుమెంట్ క్లస్టర్, 17 అంగుళాల మిక్స్డ్ మెటల్ అల్లాయ్ వీల్స్ ఈ బైక్ లో కనిపిస్తాయి. మూడు వేరియంట్లలో కూడా 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తాయి. వీటి ధరలు సుమారు రూ. 9.5 నుంచి 11.5 లక్షల రూపాయల వరకు ఉండవచ్చు.

సుజుకీ వీ- స్ట్రోమ్ 800
సుజుకి తన రాబోయే అడ్వెంచర్ టూర్ మోటర్ సైకిల్ వి-స్ట్రోమ్ 800 2022లో ఒక షోలో ఆవిష్కరించింది. కానీ ఇంకా రోడ్ మీదకు రాలేదు. ఈ బైక్ డీఈ 776సీసీ లిక్విడ్ కూల్డ్ సమాంతర ట్విన్ ఇంజిన్ ను పొందుతుంది. 230 కిలోల బైక్ లో డ్యూయల్ చానెల్ ఏబీసీ ఉంది. ముందు, వెనుక భాగంలో డిస్క్ బ్రేక్ లు ఉన్నాయి. బైక్ 20 లీటర్ ఇంధన ట్యాంక్, 220ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్, చుట్టూ ఎల్ఈడీ లైటింగ్, షోవా సస్పెన్షన్, ట్యూబ్‌లెస్ టైర్లు, ఐదు అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లేతో వస్తుంది. ఇది ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి వస్తుంది. దీని ధర 11 నుంచి 12 లక్షల రూపాయలు.