Here are the complete details of recruitment for 1284 posts in BSF.
mictv telugu

BSF Recruitment:బీఎస్ఎఫ్‎లో 1284 పోస్టులకు రిక్రూట్‏మెంట్..పూర్తి వివరాలు తెలుసుకోండి..!!

February 27, 2023

Here are the complete details of recruitment for 1284 posts in BSF.

బోర్డర్ లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు BSF అధికారిక సైట్ rectt.bsf.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు రిక్రూట్‌మెంట్ సంబంధిత సమాచారం గురించి పూర్తి తెలుసుకోలని తెలిపింది. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ప్రకటన ఫిబ్రవరి 25న ‘ఎంప్లాయ్‌మెంట్ న్యూస్’లో ప్రచురించారు.

ఖాళీల వివరాలు

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 1284 కానిస్టేబుల్ పోస్టులను రిక్రూట్ చేస్తుంది. ఈ పోస్టుల్లో పురుషులకు 1200, మహిళలకు 64 పోస్టులు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

చివరి తేదీ:
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.inని సందర్శించి దరఖాస్తు ఫారమ్‌ను తనిఖీ చేసి సమర్పించాలని బోర్డు సూచించింది. . ఈ పోస్టుల్లో పురుషులకు 1200, మహిళలకు 64 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో పొందుపరిచారు. నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి 30 రోజులు వరకు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను చెక్ చేసుకోండి.

https://rectt.bsf.gov.in/