తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 91,142 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా 33 జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఏఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించారు. ఆ వివరాలు మీకోసం..
గ్రూప్స్ ఉద్యోగాలపై క్లారిటీ..
గ్రూప్-1 కింద 503 పోస్టులు
గ్రూప్-2 కింద 582
గ్రూప్-3 లో 1, 373
గ్రూప్-4లో 9, 168 ఉద్యోగాలు
భర్తీ చేసే పోస్టులు..
రెవెన్యూ శాఖలో 3,560 పోస్టులు.
SC డెవలప్మెంట్లో 2,879 పోస్టులు.
ఇరిగేషన్ శాఖలో 2,962 ఉద్యోగాలు.
ట్రైబల్ వెల్ఫేర్లో 2, 399 పోస్టులు.
మైనార్టీ వెల్ఫేర్లో 1,825.
అటవీశాఖలో 1, 598 పోస్టులు
80,039 ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేస్తాం.
80,039 ఉద్యోగాలను ఉన్న పళంగా భర్తీ చేస్తాం.
విద్యాశాఖాలో 13, 086 పోస్టులు
హోం శాఖలో 18,334 పోస్టులు
వైద్యారోగ్యశాఖలో 12, 755 ఉద్యోగాలు
ఉన్నత విద్యాశాఖలో 7వేలకు పైగా ఉద్యోగాలు..
91,142 పోస్టులను భర్తీచేస్తాం.
కొత్తగా 91,142 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం.
ఈరోజు నుంచే నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం.
అలాగే 11వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తాం.
1.56 లక్షల ఉద్యోగాలు నోటిఫై చేశాం.
ఇప్పటికే 1.56 లక్షల ఉద్యోగాలు నోటిఫై చేశాం.
ఇందులో 1.33 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం.
మరో 22వేల ఉద్యోగాలు నియామాక ప్రక్రియలో ఉన్నాయి.
95 శాతం లోకల్ కోటా.. కేవలం 5 శాతమే ఓపెన్ కోటాలోనే ఉద్యోగాలను భర్తీ చేశాం.
విద్యుత్ శాఖలో 22వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని కేసీఆర్ వెల్లడించారు.