శాంసంగ్ గెలాక్సీ ఎస్23పై భారీ డిస్కౌంట్..వెంటనే కొనండి..ఈ ఛాన్స్ మళ్లీ రాదు..!!
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌కు భారత్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్యే కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. గెలాక్సీ ఎస్ 23 సిరీస్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు ఇప్పుడు భారీ డిస్కౌంట్ ఆఫర్‌లతో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి ఇంకా వినియోగదారులకు అందుబాటులోకి రాలేవు. ఫిబ్రవరి 23నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే ముందస్తు బుకింగ్ కు శాంసంగ్ అవకాశం కల్పిస్తోంది. అంతేకాదు పలు ఓపెనింగ్ ఆఫర్లు కూడా ప్రకటించింది. గెలాక్సీ ఎస్ 23పై ఏకంగా 13వేల భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. దీనికి అదనంగా కొన్ని బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి.
అమెజాన్‌లో ఆఫర్
గెలాక్సీ ఎస్23 ప్రారంభ ధర రూ. 74,999. ఇది 28 జీబీ వేరియంట్ ధర. ఇక 256 జీబీ వేరియంట్ ధర రూ. 79,999. అపరిమిత సేల్ ఆఫర్ లో భాగంగా అమెజాన్ లో 128జీబీ ధరతో 256జీబీ వేరియంట్ను కొనుగోలు చేయవచ్చు. 256జీబీ వేరియంట్ పై రూ. 5వేలు ఫ్లాట్ డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. దీనికి అదనంగా iciciడెబిట్, క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసినట్లయితే రూ. 8వేల డిస్కౌంట్ ను పొందవచ్చు. అన్ని ఆఫర్లను కలిపితే ధర రూ. 66,999కి తగ్గుతుంది.
స్పెసిఫికేషన్స్:
ఈ రెండు ఫోన్‌లు వినియోగదారులకు అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని ఇస్తాయి. గెలాక్సీ S23 మరియు అల్ట్రా మోడల్‌కు వేర్వేరు బ్యాటరీలు, కెమెరా సెటప్‌లు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇతర ఫీచర్లు ఉన్నందున వాటి మధ్య ధరలో పెద్ద వ్యత్యాసం ఉంది. అయితే, ఆ రెండు ఫోన్‌లు సరికొత్త క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌తోపాటు 8జీబీర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ కెపాసిటి ఉంటుంది. గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా మోడల్ కూడా స్టైలస్‌తో వస్తుంది. 45వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది. 3900ఏంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.