ఈ వారం థియేటర్లలో/ఓటీటీలో వస్తున్న సినిమాలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వారం థియేటర్లలో/ఓటీటీలో వస్తున్న సినిమాలు ఇవే..

April 20, 2022

06

దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడడంతో మళ్లీ చిత్రసీమ పుంజుకుంటుంది. రెండు సంవత్సరాలపాటు షూటింగ్‌లు, కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో నష్టాల బాట పట్టింది. గతకొన్ని నెలలుగా కరోనా తగ్గడంతో తెలుగు చిత్రసీమ పరిశ్రమతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమలు సైతం వారం వారం కొత్త సినిమాలను ఇటు థియేటర్ల ద్వారా అటు ఓటీటీల ద్వారా విడుదల చేస్తూ, లాభాల బాట పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆఖండ, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2 హిట్లతో సినిమా ఇండస్ట్రీలు ఊపిరిపీల్చుకున్నాయి. ఈ సినిమాల సక్సెస్‌ను చూసి, నిర్మాతలు మరిన్ని కొత్త చిత్రాలను రిలీజ్‌ చేయడానికి రెడీ అయ్యారు. మరి ఈ వారం అటు థియేటర్‌లో ఇటు ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న చిత్రాలేంటో తెలుసుకుందామా..

1. జెర్సీ..
షాహిద్‌ కపూర్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం .జెర్సీ’. తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించిన జెర్సీకి ఇది రీమేక్‌. తెలుగు జెర్సీని డైరెక్ట్‌ చేసిన గౌతమ్‌ తిన్ననూరి హిందీ రీమేక్‌కు సైతం దర్శకత్వం వహించాడు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈ నెల 22న థియేటర్లలో విడుదలవుతోంది.

2. 1996 ధర్మపురి
ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ సమర్పణలో గగన్‌ విహారి, అపర్ణ హీరోహరోయిన్లుగా నటించిన సినిమా 1996 ధర్మపురి. విశ్వజగత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని భాస్కర్‌ యాదవ్‌ దాసరి నిర్మించాడు. ఈ చిత్రం ఏప్రిల్‌ 22న రిలీజవుతోంది.

3. ఆహా
గని – ఏప్రిల్‌ 22

4. జీ 5
అనంతం – ఏప్రిల్‌ 22

5. నెట్‌ఫ్లిక్స్‌
కుథిరైవాల్‌ – ఏప్రిల్‌ 20
ద మార్క్‌డ్‌ హార్ట్‌ – ఏప్రిల్‌ 20
హి ఈజ్‌ ఎక్స్‌పెక్టింగ్‌ (వెబ్‌సిరీస్‌) – ఏప్రిల్‌ 21

6. సోని లివ్‌
అంత్యాక్షరి – ఏప్రిల్‌ 22

7. వూట్‌
లండన్‌ ఫైల్స్‌ – ఏప్రిల్‌ 21