ఈ వారం థియేటర్స్/ఓటీటీలో వస్తున్న సినిమాలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వారం థియేటర్స్/ఓటీటీలో వస్తున్న సినిమాలు ఇవే..

May 23, 2022

కరోనా కారణంగా రెండు సంవత్సరాలు షూటింగుల పరంగా, ఆర్థికంగా నష్టపోయిన సినీ పరిశ్రమలు గతకొన్ని నెలలుగా మళ్లీ లాభాల బాట పట్టాయి. తీరికలేకుండా షూటింగులు చేస్తూ, వారం వారం కొత్త సినిమాలను అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో విడుదల చేస్తున్నాయి. తెలుగు సినిమాలతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు సైతం విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ వారంలో ఏఏ కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయో తెలుసుకుందామా..

1. ‘ఎఫ్-3’

తెలుగు చిత్రసీమలో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాజాగా విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్స్‌గా తెరకెక్కించిన ‘ఎఫ్ 3’ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్స్, ట్రైలర్, పాటలు సామాజిక మాధ్యమాల్లో విడుదలై, మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. గతంలో విడుదలైనా ‘ఎఫ్2’ సినిమాకు కొనసాగింపుగా మూడింతలు వినోదాన్ని పంచటానికి ఈ ‘ఎఫ్ 3’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, సినిమాను దిల్ రాజు నిర్మించారు.

ఓటీటీలో..

2. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా ఓటీటీలో మే 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా మే 6న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా మే 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

3. ‘కణ్మణి ర్యాంబో ఖతీజా’

తమిళ హీరో విజయ్ సేతుపతి, సమంత, నయనతార కలసి నటించిన ప్రేమకథా చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’ తెలుగులో ‘కణ్మణి ర్యాంబో ఖతీజా’ పేరుతో విడుదలైంది. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను థియేటర్లలో అలరించిన ఈ చిత్రం మే – 27 నుంచి ‘డిస్నీ + హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ కానుంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ అందించిన సంగీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.

4. ‘అటాక్: పార్ట్ 1’

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం సూపర్‌సోల్డర్‌గా నటించిన చిత్రం ‘అటాక్: పార్ట్ I’. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాపీస్ వద్ద అంతగా రాణించలేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. ఇప్పుడు ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ జీర్‌లో మే 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

నెటిప్లెక్స్..
1. ద లాడ్జ్ (హాలీవుడి) మే 22
2. వెల్కమ్ టు వెడ్డింగ్ హెల్ (హాలీవుడి) మే 23
3. తులసీదాస్ జూనియర్ (హిందీ) మే 23
4. సేంజర్స్ థింగ్స్ (వెబ్ సిరీస్-4) మే 27
5. ఫోరెన్సిక్ (హిందీ) మే 24
6. డిస్నీ+హాట్ స్టార్‌లో
ఒబీ వ్యాన్ కెనోబీ (వెబ్ సిరీస్) మే 27 సోనీలివ్