ఈ వారం థియేటర్స్/ఓటీటీలో వస్తున్న సినిమాలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వారం థియేటర్స్/ఓటీటీలో వస్తున్న సినిమాలు ఇవే..

June 7, 2022

తెలుగు ఇండస్ట్రీతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలు కోవిడ్ తర్వాత వారం వారం కొత్త సినిమాలను ఇటు థియేటర్లలో అటు ఓటీటీల్లో రిలీజ్ చేస్తూ, సినీ ప్రియులకు అలరిస్తున్నాయి. ఈ క్రమంలో చిన్న బడ్జెట్ సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాలను గతకొన్ని నెలలుగా నిర్మాతలు థియేటర్లలో విడుదల చేస్తూ, ప్రేక్షకులను ఆనందింపజేస్తున్నారు. ఇక, ఈ వారం ఏ ఇండస్ట్రీలో ఏ కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయో తెలుసుకుందామా..

1. ‘అంటే సుందరానికీ’

తెలుగు చిత్రసీమ పరిశ్రమ నటుడు నాని గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని తన కేరీర్ ప్రారంభం నుంచి నేటీ వరకు వైవిధ్యమైన పాత్రలు, కథలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులను తెగ అలరిస్తున్నారు. నటుడు నాని కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘అంటే సుందరానికీ’. ఈ సినిమాలో నజీయా కథనాయికగా నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, పాటలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 10న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

2. ‘చార్లీ 777’

కన్నడ నటుడు ‘రక్షిత్ శెట్టి హీరోగా, కిరణ్ రాజ్ కె. దర్శకుడుగా తాజాగా తెరకెక్కిన సినిమా ‘చార్లీ 777’. జంతువులతో సినిమా తీయడం కొత్తేమీ కాదు. కానీ, ‘చార్లీ 777’ తో ప్రయాణం ఎంతో భావోద్వేగంతో ఉంటుందని అంటున్నారు చిత్రబృందం సభ్యులు. ఈ సినిమా కన్నడతోపాటు, తెలుగులోనూ జూన్ 10న విడుదల కానుంది.

3. ‘జురాసిక్ వరల్డ్ డొమినియన్’

చిన్నాల నుంచి పెద్దల వరకూ అన్ని వర్గాలను ఆకట్టుకునే కొన్ని చిత్రాల్లో ‘జురాసిక్ పార్క్’ ఒకటి. ఆ సిరీస్‌లో ఎన్నో చిత్రాలు అలరించాయి. ఇప్పుడు ‘జురాసిక్ వరల్డ్ డొమినియన్’ పేరుతో మరో కొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 10న ఇంగ్లీష్‌తో పాటు, భారతీయ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు చిత్రబృందం. క్రిస్ ప్రొట్ కీలక పాత్రలో నటించిన ఈ అడ్వెంచర్ మూవీ ఇకి కొలిన్ ట్రివోరో దర్శకత్వం వహించారు.

4. ‘డాన్’

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కథా నాయకుడిగా నీటి చక్రవర్తి దర్శకత్వంలో ఇటీవలే తెరకెక్కిన రామాంటు కామెడి డ్రామా ‘కాలేదు డాన్’ మే 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. శివ కార్తికేయన్ టైమింగ్, ఎస్. సూర్య నటన నవ్వులు పంచాయి. ఇప్పుడు ఈ సినిమా నెటిఫిక్స్ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. జూన్ 10 నుంచి కాలేజ్ డాన్ స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్ ప్రైమ్..
1. ఉడాన్ పటోలాస్ (హిందీ) జూన్ 10
సోనీలివ్
2. బన్నలే వార్ (మలయాళం) జూన్ 2
జీ5
3. ఆర్ట్ (హిందీ) జూన్ 10
4. ద బ్రోకెన న్యూస్ (హిందీ సిరీస్ ) జూన్ 10
నెటిప్లెక్స్..
5. బేటీ ఫీవర్ (వెబ్ సిరీస్) జూన్ 8
6. హసెల్ (హాలీవుడి) జూన్ 10
7. ఇంటిమసీ (స్పానిష్ సిరీస్) జూన్ 10
8. పీజీ భైండర్స్ వెబ్ సిరీస్ జూన్ 10