ఈ వారం రానున్న సినిమాలు ఇవీ - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వారం రానున్న సినిమాలు ఇవీ

April 5, 2022

gani

1.తెలుగులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది వరుణ్ తేజ్ నటించిన ‘గని’ ఏప్రిల్ 8న విడుదలవుతోంది. పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’ సినిమా స్పూర్తితో రూపొందిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్‌గా కనిపించనున్నారు. అల్లు బాబీ నిర్మించిన ఈ చిత్రంలో భారీ తారాగణం ఉంది.

2. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘డేంజరస్’. తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో రిలీజవుతోంది. అప్సర రాణి, నైనా గంగూలీ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 8న వస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో తొలిసారిగా స్వలింగ సంపర్కుల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు.

3. రెడ్డిగారింట్లో రౌడీయిజం 4. బరి 5. డస్టర్ 6. కథ కంచికి మనం ఇంటికి వంటి సినిమాలు ఈ వారం థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఓటీటీ విషయానికొస్తే రాజ్ తరుణ్ హీరోగా నటించిన స్టాండప్ రాహుల్ సినిమా ‘ఆహా’లో రాబోతోంది. ఏప్రిల్ 8న రానున్న ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కథానాయిక. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 8న ‘మర్డర్ ఇన్ అగోండా’ (హిందీ), నారదన్ (మలయాళీ) సినిమాలు విడుదలవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 7వ తేదీన ‘చస్వీ’ (హిందీ), ఎత్తర్కుం తునిందావన్ (తమిళ్) సినిమాలు వస్తున్నాయి. 8న మెటల్ లార్డ్స్, ద ఇన్‌బిట్వీన్ (ఇంగ్లీష్) సినిమాలు వస్తున్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 8వ తేదీన ‘ద కింగ్స్ మెన్’ చిత్రం వస్తుంది. జీ5లో ఎక్ లవ్ యా అనే కన్నడ సినిమా, అభయ్ అనే హిందీ సినిమా 8న స్ట్రీమింగ్ అవుతాయి.