ఈ వారం విడుదల అవుతున్న కొత్త సినిమాలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వారం విడుదల అవుతున్న కొత్త సినిమాలు ఇవే..

May 9, 2022

1.’సర్కారు వారి పాట’

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేశ్ హీరోయిన్‌గా డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు సోషల్ మీడియాలో విడుదలై, మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి.

2. ‘జయేశ్ బాయ్ జోర్డార్’

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జయేశ్ బాయ్ జోర్డార్. ఈ సినిమా మే 18న విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రణవీర్ భార్యగా షాలినీ పాండే కనిపించనుంది. ఈ సినిమాకు దివ్యాంగ్ రక్కర్ దర్శకత్వం వహించారు. భ్రూణహత్యల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో ఆడపిల్ల తండ్రిగా రణ్ బీర్ కనిపించనున్నాడు.

ఓటీటీలో..

1.’ది కశ్మీర్ పైల్స్’

చిన్న సినిమాగా విడుదలై, ఊహించనంత పెద్ద విజయం అందుకుంది ‘ది కశ్మీర్ పైల్స్’. విమర్శకుల ప్రశంసలతోపాటు వసూళ్లను రికార్డు స్థాయిలో రాబట్టింది. ఈ సినిమా మే 18 నుంచి ‘జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

2. ‘బీస్ట్’

విజయ్-నెల్సన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘బీస్ట్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెటప్లెక్స్ వేదికగా మే 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టెర్రరిజం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో విజయ్ రా ఏజెంట్ పాత్రలో నటించారు.

నెట్‌ఫిక్స్..
1.సేవేజ్ బ్యూటీ (వెబ్ సిరీస్) మే12
2.తాలెదండ (కన్నడ) మే 13
3.ముగిలిపేట్ (కన్నడ) మే13

అమెజాన్ ప్రైమ్..
1.ది మాట్రిక్స్ రెసరెక్షన్స్ (తెలుగు డబ్బింగ్) మే 12
2. మోడర్న్ లవ్ ముంబై (హిందీ సిరీస్)మే 18
3. వుషు (మలయాళం) మే13 డిస్నీ+హాట్ స్టార్ * స్నీకరెల్లా (హాలీవుడ్ ) మే 13
4. కుతుకు పత్తు (తమిళం) మే 13