ఈ వారం విడుదల అవుతున్న కొత్త సినిమాలు ఇవే..  - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వారం విడుదల అవుతున్న కొత్త సినిమాలు ఇవే.. 

May 31, 2022

1. ‘మేజర్’

 

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ కథనాయకుడిగా తాజాగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమా జూన్ 3న ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్. ట్రైలర్, పాటలు మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. 26/11 ఉగ్రదాడుల్లో పౌరుల ప్రాణాలను కాపాడుతూ అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో సయీ మంత్రేకర్, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషించారు. జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

2. ‘విక్రమ్’

కోలీవుడ్ స్టార్ హీరో, విలక్షణ నటుడు కమలహాసన్ కథనాయకుడిగా, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, నటుడు సూర్య కీలక పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ సినిమా జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీలలో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఈ సినిమాను తెరకెక్కించారు.

3. ‘9 ఆవర్స్’

తారకరత్న, అజయ్, మధుశాలిని ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ఆవర్స్’. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా జూన్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరిస్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ అందించిన కథతో నిరంజన్ కౌశిక్, జాకబ్ వర్గీన్లు తెరకెక్కించారు. ‘డెక్కన్ ఇంపీరియల్ బ్యాంక్ లో బిగంటల పాటు ఏం జరిగిందన్న ఆసక్తికర కథాంశంతో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

4. నెటిప్లెక్స్..
1. జనగణమన (మలయాళం) జూన్ 2
2. సర్వైపింగ్ సమ్మర్ (వెబ్ సిరీస్) జూన్ 3
3. ద పర్ ఫెక్ట్ మదర్ (వెబ్ సిరీస్) జూన్ 3

5. ఆమెజాన్ ప్రైమ్..
1. ద బాయ్స్ (వెబ్ సిరీస్ 3) జూన్
2. బెల్‌ఫాస్ట్ (హాలీవుడ్) జూన్ ఎంఎక్స్ ప్లేయర్
3. ఆశ్రమ్ (హిందీ సిరీస్ 3) జూన్