ఈవారం విడుదల అవుతున్న కొత్త సినిమాలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈవారం విడుదల అవుతున్న కొత్త సినిమాలు ఇవే..

June 14, 2022

రెండు సంవత్సరాలపాటు కరోనాతో అల్లకల్లోలం అయిన సినిమా పరిశ్రమలు గతకొన్ని నెలలుగా మళ్లీ థియేటర్లలో సినిమాలను విడుదల చేస్తూ, ప్రేక్షకులను తెగ అలరిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలు వారం వారం కొత్త సినిమాలను థియేటర్లలో, ఓటీటీలో విడుదల చేస్తూ, ప్రేక్షకులను ఆనందింపజేస్తున్నాయి. ఇక ఈ వారం తెలుగులో అదిరిపోయే సినిమాలు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందామా..

1. ‘విరాట పర్వం’

టాలీవుడ్‌లో గతకొన్ని నెలలుగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమా విరాట పర్వం. ఈ సినిమాలో హీరోగా రానా, హీరోయిన్‌గా సాయి పల్లవి నటించారు. ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకుడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. నక్సలిజం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథ ఈ చిత్రం. 1900లో జరిగిన యదార్ధ సంఘటనల స్ఫూర్తితో డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, పాటలు మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి.

2. ‘గాడ్సే

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేశ్ కథనాయికుడిగా గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన సినిమా ‘గాడ్సే. ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ స్వరాలు సమకుర్చారు. “సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులొస్తాయ్. వ్యాపారం చేస్తే డబ్బులొస్తాయ్, వ్యవసాయం చేస్తే డబ్బులొస్తాయ్. కానీ సేవ చేస్తున్నందుకు మీకు వందల, వేల, లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్ ? ” అనే డైలాగ్‌తో సత్యదేశ్ ప్రేక్షకుల మనసులలో సినిమాపై భారీ అంచనాలను పెంచారు. జూన్ 17న మరీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

3. ‘కిరోసిన్’

మిస్టరీ కథంశంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో చిత్రం ‘కిరోసిన్’. ఈ సినిమాను ధృవ స్వీయ తెరకెక్కించారు. దీప్తి కొండవీటి, పృధ్వీ యాదవ్ ఈ సినిమాను నిర్మించారు. జూన్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, పాటలు మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి.

ఓటీటీలో వస్తున్న సినిమాలు ఇవే..

4. ‘జయమ్మ పంచాయితీ’

టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైనా విషయం తెలిసిందే. ఈ సినిమాను విజయ్ కుమార్ కలివరపు తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సీమింగ్ కానుంది. జూన్ 14 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

5. ‘రెక్కీ’

క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెక్కీలో శ్రీరామ్, శివ బాలాజీ, ధన్య బాలకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ వెబ్ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ జీస్ లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ విషయంపై చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులోని నటులంతా సీరియస్‌గా చూస్తూ కనిపించారు.

6. ’02’

నయనతార కీలక పాత్రలో జీఎస్ విఘ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ’02” (ఆక్సిజన్). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిస్నీ +హాట్ స్టార్ లో జూన్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. కొడుకుతో కలిసి నయనతార ప్రయాణం చేస్తున్న బస్సు అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటుంది. కొండచరియలు విరిగి పడటంతో బస్సు పూర్తిగా భూమి లోపలకి కూరుకుపోతుంది.నయనతార తన కొడుకుని ఎలా కాపాడుకుంది? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే!

7. అమెజాన్ ప్రైమ్
1. అవతార పురుషా-1 (కన్నడ) జూన్ 14
2. సుజల్ (తమిళ సిరీస్ 2) జూన్ 17

8. నెటిప్లెక్స్..
1. గాడ్స్ ఫేవరెట్ ఇడియట్ (వెబ్ సిరీస్) జూన్ 15
2. ది రాత్ ఆఫ్ గాడ్ (హాలీవుడ్) జూన్ 15
3. షి (హిందీ సిరీస్ 2) జూన్ 17
4. ఆపరేషన్ రోమియో (హిందీ) జూన్ 18
5. సీబీఐ పద బ్రెయిన్.. జూన్ 18
6. సోనీలివ్.. సాల్ట్ సిటీ (హిందీ సిరీస్) జూన్ 16
7. ఇన్ఫినీట్ స్టోర్స్ (హాలీవుడి) జూన్ 14
8. ఫింగర్ టిప్ (హిందీ, తమిళ సిరీస్) జూన్ 17
9. బుక్ మై షో.. పారలర్ మదర్స్ (స్పానిష్) జూన్ 17
డిస్నీ+హాట్ స్టార్.. మసూమ్ (హిందీ) జూన్ 17