1. ‘ఆచార్య’
టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి, కీలక పాత్రలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించారు. ఈ సినిమా ‘ధర్మస్థలి’ అనే ప్రాంతం చుట్టూ తిరిగే కథతో అభిమానులను అలరించేలా కొరటాల శివ సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలను చూస్తే, అర్ధమవుతోంది. ఇక తెరపై చిరు-చరణ్ కనిపించే సన్నివేశాలు మరో స్థాయిలో ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికే యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. తండ్రీ కొడుకుల మేజిక్ చూడాలంటే ఏప్రిల్ 29వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే.
2. ‘కణ్మని రాంబో ఖతీజా’
తమిళ హీరో విజయ్ సేతుపతి, నయనతార, సమంత కీలక పాత్రల్లో విఘ్నేశ్ శివన్ తెరకెక్కించిన చిత్రం ‘కాతు వాక్కుల రెండు కాదల్. తెలుగులో ‘కణ్మని రాంబో ఖతీజా పేరుతో ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఈ సినిమా ఒక వ్యక్తి ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తే, అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఇద్దరితోనూ అతను పడిన కష్టాలేంటి? చివరకు ఇద్దరి మనసులను గెలుచుకున్నాడా? అన్నది తెలియాలంటే ఏప్రిల్ 28న ‘కణ్మని రాంబో ఖతీజా’ చూడాల్సిందే.
3. ‘రన్పై 34’
బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్ దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రన్పై’. అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 20 ప్రేక్షకుల ముందుకు రానుంది. 2015లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. విమానయాన రంగం చుట్టూ తిరిగే ఈ కథలో అజయ్, రకుల్ పైలట్లుగా, అమితాబ్ విచారణాధికారిగా నటిస్తున్నారు.
నెటిప్లెక్స్..
1. గంగూబాయి కథియావాడి.. ఏప్రిల్ 26
2. 365 డేస్ ది డే హాలీవుడ్
3. మిషన్ ఇంపాజిబుల్ (తెలుగు) ఏప్రిల్ 29
4. ఓ జార్క్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 29
5. బేక్ట్ (హిందీ సిరీస్-3) ఏప్రిల్ 25
6. ద ఆఫర్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 28
డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
7. అనుపమా: నమస్తే అమెరికా (హిందీ) ఏప్రిల్ 25
8. నెవర్ కిస్ యువర్ బెస్ట్
9. ఫ్రెండ్ (హిందీ) ఏప్రిల్ 29