ఈ వారం థియేటర్/ఓటీటీలో వస్తున్న కొత్త సినిమాలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వారం థియేటర్/ఓటీటీలో వస్తున్న కొత్త సినిమాలు ఇవే..

May 2, 2022

కరోనా కారణంగా రెండు సంవత్సరాలు నష్టాల బాటపట్టిన సినీ పరిశ్రమలు గత కొన్ని నెలలుగా మళ్లీ పుంజుకుంటున్నాయి. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ వంటి పరిశ్రమలు థియేటర్స్/ఓటీటీలలో వారం వారం కొత్త సినిమాలను రిలీజ్ చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇటీవలే దేశవ్యాప్తంగా విడుదలైన ‘ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ 2’ వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేసి, రికార్డ్ సృష్టించాయి. ఇక ఈ వారం ఇటు థియేటర్లలో అటు ఓటీటీలో విడుదల అవుతున్న కొత్త సినిమాలు తెలుసుకుందామా..

1. భళా తందనాన

శ్రీవిష్ణు హీరోగా, కేథరిన్ హీరోయిన్‌గా డైరెక్టర్ చైతన్య దంతులూరి తెరకెక్కించిన చిత్రం ‘భళా తందనాన’. ఈ చిత్రం సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను వారాహి చలన చిత్రం పతాకంపై జనీ కొర్రపాటి నిర్మాత. సాయి కొర్రపాటి నిర్మించారు.

2. జయమ్మ పంచాయతీ

సినీ ప్రియులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన యాంకరింగ్‌తో పలు షోల ద్వారా ప్రజలకు వినోదాన్ని అందిస్తున్నారు. మొదటిసారిగా పూర్తిస్థాయి పాత్రతో ‘జయమ్మ పంచాయతీ’ అనే చిత్రంతో ముందుకు వస్తున్నారు. ఈ సినిమా మే 6న తేదీన విడుదల కానుంది. పల్లెటూరి డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో ఎవరికీ, దేనికీ లొంగని నిస్వార్థపూరితమైన పల్లెటూరి మహిళగా సుమ కనిపించనున్నారు. ఈ సినిమాను విజయ్ కుమార్ కలివరపు తెరకెక్కించాడు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించటంతో అంచనాలు భారీగా పెరిగాయి.

3. అశోకవనంలో అర్జున కళ్యాణం

విశ్వాక్ సెన్, రుక్సార్ ధిల్లాన హీరో, హీరోయిన్‌గా డైరెక్టర్ విద్యాసాగర్ చింతా తెరకెక్కించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ, మే 6వ తేదీన విడుదల కానుంది. పెళ్లి చూపులకని గోదావరి జిల్లాకు వెళితే, 18 ఏళ్ల అర్జున్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అక్కడ పెళ్లివాళ్ల నుంచి ఎలాంటి మర్యాదలు అందాయి? అనుకోని పరిస్థితుల్లో పెళ్లి ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందేనని విశ్వాస్ సెన్ తెలిపారు.

4. చిన్ని

మహానటి సినిమాతో సినీ ప్రియులకు దగ్గరైన హీరోయిన్‌ కీర్తి సురేశ్. తాజాగా సెల్వరాఘవతో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం ‘చిన్ని’. ఈ సినిమాను డెరెక్టర్ అరుణ్ మథేశ్వరం తెరకెక్కించారు. మే 6వ తేదీన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదల కానుంది.

5. అమెజాన్ ప్రైమ్..
ద వైల్డ్స్ (వెబ్‌సిరీస్ 2) మే 6
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(కన్నడ) మే

6. నెటిప్లెక్స్..
రాధేశ్యామ్ (హిందీ) మే 4
40 ఇయర్స్ యంగ్ (హాలీవుడ్) మే 4
థార్(హిందీ) మే 8
ఎలోన్ ఫర్ ది రైడ్ ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ (వెబ్ సిరీస్) మే 6