ఈ వారం థియేటర్స్/ఓటీటీలో రానున్న సినిమాలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వారం థియేటర్స్/ఓటీటీలో రానున్న సినిమాలు ఇవే..

March 7, 2022

SURYA

తెలుగు చిత్రసీమ పరిశ్రమతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలు సైతం వారం వారం కొత్త సినిమాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగులో తమ అభిమాన హీరో కొత్త సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని అభిమానులు ఎదురుచూస్తుంటారు. మరి ఎందుకు ఆలస్యం ఈ వారం ఏఏ కొత్త సినిమాలు అటు థియేటర్స్‌లో, ఇటు ఓటీటీలో విడుదల అవుతున్నాయో తెలుసకుందామా..

1. ‘ఆకాశమే హద్దురా’, ‘జై భీమ్’ చిత్రాలతో ఓటీటీ వేదికగా వరుస విజయాలు అందుకున్నారు హీరో సూర్య. ఆయన కథానాయకుడుగా నటించిన ‘ఈటితో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. పాండిరాజ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు థియేటర్స్ వేదికగా విడుదల అవుతుంది.

2. విధితో పోరాటం చేసిన ఓ జంట ప్రేమకథ ఎలాంటిదో తెలియాలంటే తమ సినిమా చూడాల్సిందే అంటున్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన పాన్ ఇండియా లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’. పూజా హెగ్లే కథానాయిక. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, ప్రమధ నిర్మిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పకులు. వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు మార్చి 11న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

3. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుష్.. ఇప్పుడు ‘మారన్ చిత్రంతో అలరించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ తమిళ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. మాళవిక మోహనన్ కథానాయిక. డిస్నీ హాట్ స్టార్ మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ధనుష్ జర్నలిస్టుగా కనిపించనున్నారు.

4. ఇటీవల కాలంలో క్రీడా నేపథ్యంలో సాగే కథలతో సినిమాలు తరచూ బాక్సాఫీస్ ను పలకరిస్తున్నాయి. అలా ఆది పినిశెట్టి కథానాయకుడిగా పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘క్లాప్’. ఆకాంక్షసింగ్ నాయిక. రామాంజనేయులు జవ్వాజి, ఎమ్. రాజశేఖర్ రెడ్డి నిర్మాతలు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా మార్చి 11 ప్రముఖ ఓటీటీ సోనీలివ్ వేదికగా సీమింగ్ కానుంది.

ఓటీటీలో రానున్న సినిమాలు..

రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడీ’. డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్ స్టార్ వేదికగా మార్చి 11వ తేదీ సాయంత్రం 6గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్ ప్రైమ్

* అప్లోడ్ (వెబ్ సిరీస్-2) మార్చి 11

నెప్లెక్స్

* అవుట్ ల్యాండర్(వెబ్ సిరీస్-6) మార్చి 07
* ద ఆండీ వార్‌హోల్ డైరీస్ (వెబ్ సిరీస్) మార్చి 09
* ద లాస్ట్ కింగ్ డమ్ (వెబ్ సిరీస్-5) మార్చి 09 * ఆ ఆడమ్ ప్రాజెక్టు (హాలీవుడ్)మార్చి 11 రానున్నాయి.