Here are the videos of Pakistan-Afghanistan fans who were beaten
mictv telugu

కొట్టుకున్న పాక్‌-అఫ్గాన్‌ ఫ్యాన్స్‌..వీడియోలు వైరల్

September 8, 2022

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా గతరాత్రి పాకిస్తాన్-అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్‌ను వీక్షిస్తున్న వారందరూ ఖచ్చితంగా అఫ్గానిస్థాన్‌ జట్టే గెలుస్తుందని అంచనాలు వేశారు. కానీ, చివరి ఓవర్లో పాకిస్తాన్‌ యువ క్రికెటర్ నసీమ్ షా..వెంట వెంటనే రెండు సిక్సర్లను కొట్టి, విజయ ఢంకా మోగించాడు. ఈ క్రమంలో మ్యాచ్‌ను వీక్షించటానికి వచ్చిన పాకిస్తాన్, అఫ్గానిస్థాన్‌ క్రికెట్ ప్రియులు మ్యాచ్ ముగిసిన అనంతరం ఒకరిపై ఒకరు కలబడి కొట్టుకున్న కొన్ని వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీడియోలను చూస్తున్నవారంతా ‘క్రికెట్ అంటే ఇంతా పిచ్చి ఉంటుందా, మ్యాచ్ ఓడిపోతే ఇంతలా కొట్టుకుంటారా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

వివరాల్లోకి వెళ్తే.. ఆసియాకప్‌లో భాగంగా బుధవారం పాక్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌‌.. తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. చివరి దాకా నువ్వా, నేనా అన్నట్లుగా సాగింది. చివరికి ప్రత్యర్థి పాకిస్తాన్ గెలుపొందింది. దాంతో సొంత టీం ఓటమిని తట్టుకోలేకపోయిన ఫ్యాన్స్‌..స్టేడియంలో గలాటా చేశారు. ఆపోజిట్‌ టీం అభిమానులను చితకబాదారు. కుర్చీలు పీకిపడేశారు. స్టేడియంలో రచ్చరచ్చ చేశారు. పాక్‌ విజయం సాధించడంతో ఆ జట్టు అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.

 

అప్పటికే ఆగ్రహంతో రగిలిపోయిన అఫ్గాన్‌ అభిమానులు షార్జా స్టేడియంలో రచ్చరచ్చ చేశారు. పాక్‌ అభిమానులపై దాడులు చేశారు. ప్రతిగా వారు కూడా దాడికి దిగడంతో పెద్ద గలాటాయే చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. స్టేడియంలో కుర్చీలను చిందరవందరగా పడేశారు. పాకి జెర్సీ వేసుకున్న ఓ వ్యక్తిని మరో వ్యక్తి కుర్చీతో కొడుతున్న దృష్యాలు వీడియోలో రికార్డయ్యాయి.