Here is the video of Ganguly dancing on the streets of London
mictv telugu

లండన్ వీధుల్లో డ్యాన్స్ చేసిన గంగూలీ.. వీడియో ఇదిగో

July 9, 2022

Here is the video of Ganguly dancing on the streets of London

టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో గంగూలీ తన కూతురు సనా ఎదురుగా బాలీవుడ్ బాద్షా షారుక్‌ ఖాన్‌ నటించిన ఓం శాంతి ఓం శాంతి టైటిల్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ, పరవశించిపోతున్నాడు. మరో బాలీవుడ్‌ హిట్‌ సాంగ్‌కు ఆయన భార్య డోనాతో కలిసి స్టెప్పులు వేశాడు.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి శుక్రవారం 49 సంవత్సరాలు పూర్తి చేసుకొని, 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా బర్త్ డే వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో జై షా, సచిన్ టెండూల్కర్ తదితరులు పాల్గొన్నారు. వారితో కలిసి గంగూలీ లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆయన కూతురు సనాతో, భార్య డోనాతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు.

మరోపక్క గంగూలీ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు, తాజా, మాజీ క్రికెటర్లు శుభాకాంక్షల మీద శుభాకాంక్షలు చెప్తూ, పోస్టులతో సోషల్ మీడియాను హోరెతిస్తున్నారు. యువరాజ్ సింగ్ ట్విట్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే దాదా. నువ్వో గొప్ప స్నేహితుడివి. నువ్వో ప్రభావవంతమైన కెప్టెన్‌వి. సీనియర్ కానీ, జూనియర్ కానీ ఎవరైనా సరే నీ నుంచి నేర్చుకోవాలని అనుకుంటారు. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. ప్రేమ పూర్వక శుభాకాంక్షలు’ అని పేర్కొన్నాడు.